You are not special, you should suffer
మన జీవితం లో ఎప్పుడు సుఖాలకే అలవాటు పడిపోయి దుఃఖం వచ్చినప్పుడు తప్పించుకుని తిరిగితే, మీ జీవితంలో మీకు తెలిసే చాలా తప్పులు చేసేస్తారు. అందుకే అప్పుడప్పుడయినా మీ జీవితంలో వచ్చిన దుఃఖాన్ని భరించి, చేసిన తప్పులని తెలుసుకుంటే మళ్ళి ఆ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
Focus on your purpose and your values
ప్రతి మనిషికి ఒక్క పర్పస్ ఉంటుంది తాను జీవితంలో ఒకటి అవ్వాలి అని, తన ఇంటిని బాగా చూసుకోవాలి అని లేకపోతే ఇంత సంపాదించాలి అని, మీ జీవితం లో మీ purpose ఏంటి? మీరు ఆనందం గా ఉండాలి అంటే మీరు మీ జీవితానికి ఉన్న పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవాలి, మీ జీవితం లో మీ పర్పస్ ఏంటో మీకు తెలియకపోతే ఇప్పుడే ఆలోచించండి, మీరెందుకు ఒక పని చేస్తున్నారు?దాని లక్ష్యం ఏంటి? దాని ఉద్దెశం ఏంటి ? అనేది తెలుసుకుంటే మీ life పర్పస్ ఏంటో మీకు ఒక్క అవగాహన వచ్చేస్తుంది, అలాగే మీ జీవితం లో మీరు పాటించవలసిన వాల్యూస్ ఏంటో తెలుసుకోవాలి, ఎందుకంటే మీ వేల్యూ మీ పర్పస్ వైపు తీసుకువెళ్తాయి.
మీ పర్పస్ ఏంటి మీ వాల్యూస్ ఏంటి ఇప్పుడే తెలుసుకోండి ఇది మీ జీవితాన్ని ఇంకా సింపుల్ చేస్తుంది, ఏ విషయాన్నీ పట్టించుకోవాలో మీకు అర్ధం అవుతుంది.
Taking action is the ultimate thing you can do.
ముందుగా ఒకటి తెలుసుకోండి జీవితాన్ని ఎప్పుడు మీరు కంట్రోల్ చేయలేరు, ఎప్పుడు ఎం జరుగుది అనేది మీ చేతిలో లేదు, మీ చేతిలో ఉంది ఒకటే ఎం జరిగిన దాన్ని ఎలా డీల్ చేస్తావు అనేది మాత్రమే మీ చేతిలో ఉంది.
Believe me we can learn anything
మీ బ్రెయిన్ చెప్పే అన్ని విషయాలు నిజం కాదు అనే నిజం మీరు తెలుసుకోవాలి, ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఇది నీ వల్ల కాదు అని మీ జీవితం లో రకరకాల examples ఇస్తుందో, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అది మిమల్ని భయపెడుతుంది అని అలాగే అది నిజం నుంచి మిమల్ని అబధం వైపు తీసుకువెళ్తుంది అని , అలాంటి సమయం లోనే మీరు భయపడాల్సిన పని లేదు ఆ సమయంలో ఏది నిజమో తెలుసుకుని ఆ నిజం వైపు వెళ్ళాలి అనే ఆలోచన మీకు రావాలి.
How to live a happy life ?
ఈ question కి ఆన్సర్ తెలిస్తే ఎవరైనా జీవితం లో హ్యాపీగా బ్రతికేస్తారు కదా?
ఇప్పుడు ఉన్న మన సొసయిటీ లో మనకి లెక్కలేనన్ని ఛాయస్ లు ఉన్నాయి, మీ కెరీర్ నే ఉదాహరణగా తీసుకుంటే ఇంజనీర్, డాక్టర్, రైటర్, లాయర్, ఫిలిం మేకర్ ఇలా ఎన్నో ఎన్నో, ఎన్నో , ఇన్ని attractive కెరీర్స్ ఉన్నప్పుడు మనం ఎం తెలుసుకోవాలి అంటే, మీ purpose అండ్ మీ values ని పూర్తి చేసే ఛాయస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలిమీరు ఒక్క ఛాయస్ తీసుకున్నాక మీ దృష్టి లో ఇంకో ఛాయస్ గురించి ఆలోచించనేకూడదు, మీ ఛాయస్ మీ దృష్టిలో పెట్టుకుని దానికి ఎం కావాలో అది చేస్తూ ఉంటె మీ లైఫ్ సింపుల్ గా ఉంటుంది, మీ జీవితం లో ఎక్కువ choice లు ఉంటె మీ లైఫ్ complicated అవుతుంది. అందుకే ఎప్పుడు తక్కువ choice లు పెట్టుకోండి. అది లేదు ఇది లేదు అనే ఆలోచన లో ఉండకండి . చాల researches కూడా చెబుతుంది ఏంటి అంటే నిజమైన ఆనందం తక్కువ choice లో నే ఉంది అని చెబుతున్నారు. అలాగే మీ జీవితం లో మీరు choice ఎలా తీసుకుంటున్నారో వేరే వాళ్ళ జీవితం లో వాళ్ళకి వారు తీసుకునే ఛాయస్ ని కూడా మీరు గౌరవించాలి, మీరు ఒక్క రిలేషన్ లో ఉన్నప్పుడు మీ choice కరెక్ట్ అని మీరు ఎలా అనుకుంటారో అవతల వారు కూడా వారి ఛాయస్ కరెక్ట్ అని వారు అనుకుంటారు సో వాళ్ళ choice కి respect ఇచ్చి మాట్లాడాలి. అలాగే చాలా మంది వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ మనవళ్ల కోసం పనిచేస్తునాం అని, వారు పోయాక కూడా వారు సంపాదించింది వారి తరువాత వారికి ఉపయోగపడాలి అని కష్టపడిపోతా ఉంటారు, కానీ మీరు నిజంగా హ్యాపీగా బ్రతకాలి అంటే ఇంత ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా మీ ప్రస్తుతం లో బ్రతకాలి ఎందుకంటే, డబ్బు సంపాదించాలి అని వాళ్ళ కుటుంబానికి సమయం ఇవ్వకుండా తిరగటం వల్ల వారు కొలిపోయేది డబ్బు తో వెల కట్టలేనిది,
"చావు అందరికి వస్తుంది, మీరు చనిపోయాక మీ ఫామిలీ ఆనందం గ బ్రతకాలి అనే ఆలోచన కన్నా చచ్చే లోపు మీ ఫామిలీ తో మీరు ఆనందం గ బ్రతకాలి అనేది ఆనందానికి అసలైన సీక్రెట్."