ఎప్పుడు మనం మాటలతో సమయాన్ని గడపకూడదు, మన చేతలతో అందరి నోర్లు మూపించాలి, చివరిసారిగా మీరు ఉంటున్న ఆ గుంపు ని చుడండి, ఇంకా ఆ గుంపు ని వదిలేసి మీ దారిలో వెళ్ళవలసిన సమయం వచ్చేసింది, ఆ దారిలో మీరు వంటరి అయినా పరవాలేదు మీరు అనుకున్న దారిలో మీరు వెళ్ళాలి. అయినా సరే మీ చుట్టూ పక్కన ఉండే వాళ్ళు మళ్ళి మిమల్ని గుంపులోకి లాక్కురావాలి అని అనుకుంటారు, వదలదు మీ దారిని అసలు వదలదు, నీ తో పోటీ పడే వాళ్ళు, నీ ఎదుగుదల ఇష్టం లేనివాళ్లు నిన్ను దించాలి అనుకుంటారు, నిన్ను తక్కువ గా చూపించాలి అనుకుంటారు,గెలవనివ్వదు వాళ్ళని అసలు గెలవనివ్వదు, వాళ్ళకి నీ గర్జన(కాంఫిడెన్స్) తో సమాధానం చెబుతూ నీ దారిలో ముందుకు వెళ్ళిపో. మొన్న భారత దేశానికి ఆసియన్ గేమ్స్ లో పథకాల పంట పండించిన హిమ దాస్, పదమూడు ఏళ్లకే మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఇలాంటి వారు ఎందరో వాళ్ళ కలల కోసం వెనుకడుగు వెయ్యక, వాళ్లకున్న కష్టాలని లెక్కచేయక, నా వల్ల సాధ్యం అని అనుకుని విజయాన్ని సాధించారు,అలాగే మనం కూడా మనం సాధించవలసిన గోల్స్ ని సాధ్యమే అని ధైర్యం తో ఒకొక అడుగు ముందుకు వేస్తూ, సాహసం తో మంచి నిర్ణయాలు తీసుకుంటూ, కష్టాలని మనో బలం తో ఎదురుకుంటూ, అందరిని కమాండ్ చేసే నాయకత్వం తో సింహం లా ముందుకు వెళ్ళిపోవాలి.
📷